సీఎం జగన్‌ నిర్ణయం..పేద విద్యార్థులకు వరం

సీఎం జగన్‌ నిర్ణయం..పేద విద్యార్థులకు వరం



సాక్షి, అనంతపురం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీష్‌ మీడియం చదువులకు బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. అనంతపురం ఎన్జీవో హోం లో రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆంగ్ల మాద్యమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని బీసీ సంఘం ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నేతలు స్వాగతించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వైఎస్ జగన్ నిర్ణయం ఓ వరమని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో పేద విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లీషు మీడియం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్ విమర్శలు అర్థరహితమన్నారు.